ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి కరపత్రాలు, స్టిక్కర్లను అందించడం కాకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్పష్టంగా వివరించాలని అన్నారు.