పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభమైన ఖరీఫ్‌ దుక్కులు

84చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభమైన ఖరీఫ్‌ దుక్కులు
మృగశిర కార్తి సమీపిస్తున్న సమయంలో జోరుగా వ్యవసాయ పనులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల కురిసిన చెదురు మదురు వర్షాలకు పొలాల్లోని కుంటల్లో నీరు చేరడంతో నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఖరీఫ్‌ దుక్కులు జోరుగా సాగుతున్నాయి. ఆర్‌బికెల ద్వారా రైతులకు రాయితీపై విత్తనాలను సమకూర్చనున్నట్లు ప్రకటించడంతో విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్