మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడేందుకు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ రాష్ట్ర అధికారి లక్ష్మిషాను కోరారు. గురువారం ఎమ్మెల్యే ఆయన్ను కలిసి జిల్లాలో వైద్య కళాశాల వివరాలు అందించారు. జిల్లా కేంద్రంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వచ్చేలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మంజూరైన మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలన్నారు.