పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్టి నాయుడును నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలోని డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్ పనిచేస్తున్న నాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా విద్యాశాఖాధికారి గా నియమించారు. ఇంతవరకు డిఇఒగా ఉన్న జి. పగడాలమ్మను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.