ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతి నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9: 30గంటల నుంచి మధ్యాహ్నం 12: 45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టైం టేబుల్ను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చదవాలని విద్యార్థులకు సూచించారు.