పార్వతీపురంలోని దాదాపు చెరువులన్నీ మున్సిపాలిటీ కబ్జా చేసిందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దాలినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ తాజాగా గోప సాగరం కబ్జా చేస్తున్నట్లు రాయగడ రోడ్డులో సర్వేనెంబర్ 102లో సుమారు 32ఎకరాల విస్తీర్ణం కలిగిన గోపసాగరాన్ని చందర్రావుతో కలిసి ఆయన సందర్శించారు. డంపింగ్ యార్డులతో ఈ చెరువు కూడా కబ్జాకు గురవుతోందని తెలిపారు.