పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో జరిగిన పీసా ఎన్నికల్లో 278 గ్రామాలకు గాను 277 గ్రామాల్లో ఏకగ్రీవం అయినట్లు ఐటీడీఏ పి ఓ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది పీసా మండలాలలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు 278 పీసా గ్రామాలలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు ఎన్నికలు జరగగా 277 గ్రామాల్లో ఉపాధ్యక్షులు కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.