పార్వతీపురం ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు

84చూసినవారు
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై పెద్దబొండపల్లికి చెందిన చుక్క శ్రీదేవమ్మ సంచలన ఆరోపణలు చేసింది. ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి అసలు విషయం తెలుసుకోకుండా ల్యాండ్ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని ఆమె ఆరోపించారు. మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి, తాను కొనుక్కున్న ఆస్తిని కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్