రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పార్వతిపురం మన్యం జిల్లా అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగరాధ, సిఐటియు జిల్లా ఉప కార్యదర్శి ఎన్ వై నాయుడుల ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడి కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు యొక్క సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.