సాలూరు అర్బన్ మరియు రూరల్ పరిధికి సంబంధించిన అంగన్వాడీలు ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపకార్యదర్శి ఎన్ వై నాయుడు మరియు మన్యంజిల్లా అంగన్వాడీల ఉపకార్యదర్శి బలగరాధ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం 8వరోజుకి చేరుకుంది. అంగన్వాడీల సమస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.