మెంటాడ ఎంపీడీవోగా శనివారం సాయంత్రం భానుమూర్తి బాధ్యతలు చేపట్టారు. మండలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికి పనులు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇటీవల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా పర్య వేక్షించి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అన్నారు. ఈఓపి ఆర్డి కమల కుమారి, ఏపీవో చిన్నప్పయ్య సిబ్బంది పాల్గొన్నారు.