పెద్ద చీపురు వలస గ్రామం వద్ద పారమ్మ కొండమీద సోమవారం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి పలు గ్రామాల నుండి పలువురు దంపతులు పాల్గొనడం జరిగింది. భారీ సంఖ్యలో కళ్యాణ మహోత్సవానికి భక్తులు బారులు తీశారు. కళ్యాణం అనంతరం అన్న సమరాధన కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.