మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో శుక్రవారం రీ సర్వే భూ సమస్యల పరిష్కార గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో మండల తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఎస్ వెంకట్రావు, మండల సర్వేయరు జ్యోతి, నాయకులు గెద్ద అన్నవరం, గేదెల రామకృష్ణ, వీఆర్ ఓ జె మెరకయ్య తదితరులు పాల్గొన్నారు.