పెద్దగడ్డ జలాశయంలో నీటిని విడుదల చేసిన అధికారులు

53చూసినవారు
పెద్దగడ్డ జలాశయంలో నీటిని విడుదల చేసిన అధికారులు
పాచిపెంట మండలం కేసలి వద్ద నిర్మించిన పెద్ద గడ్డ జలాశయం నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద గడ్డ జలాశయం పూర్తిస్థాయిలో నిండుకుంది. 12 వేల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఒక టీఎంసీ సామర్థ్యంతో జలాశయం నిర్మించడం జరిగింది. జలాశయం నిండిపోవడంతో రభీ, ఖరీఫ్ సీజన్ కు నీరు ఉపయోగపడే విధంగా జలాశయం పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్