రైతులు విత్తనాలను వేసుకునే ముందు మేలైన రకాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలని లేదా నారు శుద్ధి చేసుకొని నాటుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. శనివారం పాచిపెంట మండలం పెదకంచూరు గిరిజన గ్రామంలో నిర్వహించిన మేలైన వ్యవసాయ పద్ధతుల పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.