మోటార్ రంగంలో ఉన్న కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 4న సాలూరు లారీ ఓనర్స్ కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మోటారు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్వై నాయుడు తెలిపారు. సదస్సుకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని లారీ ఓనర్స్ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మోటారు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందనం ధరలు తగ్గించాలని కోరారు.