జయతిలో ఆంజనేయ స్వామి కి విశేష పూజలు

71చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారికి శనివారం విశేష పూజలు జరిగాయి. మండల ధనంజీ రావు దంపతులచే పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల అర్చకులు స్వామివారిని అష్టోత్తర శతనామావళితో పూజలను నిర్వహించారు. స్వామివారి మెడలో తమలపాకుల దండలు మరియు నిమ్మకాయల దండలను అలంకరించి గంధసిందూరంతో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో పూజలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్