సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో అతిసారం ప్రబలి ఇద్దరు వ్యక్తులు లెంక బంగారమ్మ(75), ఒడిశా వాసి సీతన్న(72) శుక్రవారం మృతి చెందారు. 9 మంది ఆసుపత్రిలో చేరగా, మరో 25 మంది వరకు అతిసార వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో పాచిపెంట మండల పీహెచ్ఐల వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సంఘటన స్థలంకి వెళ్లి పరామర్శించారు.