ఐదేళ్లపాటు అరాచక పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేని విధంగా తీర్పునిచ్చి చంద్రబాబుని సీఎం చేసారని, అందుకు మేమంతా మీకు రుణపడి ఉంటామని మంత్రి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మండలం మామిడిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సాలూరు అభివృద్ధి కోసం 173కోట్ల రూపాయలను మంజూరు చేయించానని మంత్రి అన్నారు. ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం అన్నారు.