సంతకవిటి: గ్రామాలు అభివృద్ధి కూటమి తోనే సాధ్యం
సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామంలో శుక్రవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగు యువత మండల అధ్యక్షులు వి. శ్రీనివాస్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పల్లె పండుగ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, మాజీ సర్పంచ్ బండారు రామకృష్ణ, టీడీపీ నేత జనార్ధన్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.