శృంగవరపుకోటలో 104 వైద్య శిబిరం

66చూసినవారు
శృంగవరపుకోటలో 104 వైద్య శిబిరం
ఎస్. కోట మండలం పెద్దకండేపల్లిలో కొట్టాం పిహెచ్సి వైద్యురాలు ఆధ్వర్యంలో శనివారం 104 వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో రోగులకు బిపి, షుగర్ తదితర చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరం వద్దకు రాలేని రోగులు ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్