టిడిపి విజయోత్సవాల ర్యాలీలతో హోరిత్తుతున్న నియోజకవర్గం

78చూసినవారు
టిడిపి విజయోత్సవాల ర్యాలీలతో ఎస్ కోట నియోజకవర్గం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ కోట మండలం చందులూరులో ఆదివారం రాత్రి మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాగా ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరయ్యారు. గ్రామ ప్రజలు ఆమెకు బాణసంచా కాలుస్తూ, కోలాటం నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. తనను గెలిపించిన ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్