లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైనా.. రాజ్యసభ సభ్యుడిగా లేకపోయినా.. పంజాబ్ నేత రవనీత్ సింగ్ బిట్టు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రవనీత్ సింగ్ పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు. పంజాబ్ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బియాంత్.. సీఎంగా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఆ కుటుంబ వారసుడు కావడం కూడా రవనీత్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.