ఎస్ కోటలో ఈ దుస్థితికి కారణం అక్రమ కట్టడాలే!?

558చూసినవారు
ఎస్ కోట లో వర్షం పడితే నీరు రోడ్లపై ఏరులై పారడంతో పాటుగా పలు కాలనీల్లో నీరు నిల్వ ఉండిపోతోంది. దీంతో ప్రజానీకం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటం విదితమే. పట్టణంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ వెనుక గల గెడ్డ నుండి వన్ వే ట్రాఫిక్ వద్ద కన్నెంగెడ్డ వరకు గెడ్డలో యధేచ్ఛగా నిర్మించిన అక్రమ నిర్మాణాలే ఈ దుస్థితికి కారణమని, అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్