వేపాడ మండల టిడిపి నాయకులతో ఆత్మీయ సమావేశం

50చూసినవారు
వేపాడ మండల టిడిపి అధ్యక్షులు గొంప వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రమణమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారిని ఎల్ కోట ఆమె నివాసంలో కలిశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను అఖండ మెజారిటీతో గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్