కొత్తవలస మాజీ ఎంపీపీ పొలమరశెట్టి రాజన్న సోమవారం మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ తో కలసే సందర్శించి తన నివాళులు అర్పించారు. టిడిపి కార్యకర్తల హృదయాల్లో రాజన్న చెరగని ముద్ర వేశారని, ఆయన కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.