ఎస్. కోట మండలం వెంకటరమణపేటకు చెందిన గుదే రవణమ్మ బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చొరవ తీసుకుని సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎస్ కోట పార్టీ కార్యాలయంలో గురువారం రవణమ్మకు రూ.4.50 చెక్కును అందజేశారు. సీఎం
జగన్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటరమణ తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు.