ఎస్ కోట: తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం

65చూసినవారు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఎస్. కోట మండలంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఎస్. కోట పాత బస్టాండ్ నుండి ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అక్రమంగా తొలగించిన మిడ్ డే మీల్స్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్