ఎస్ కోట: అగ్నిప్రమాదంలో దగ్ధమైన వరికుప్పలు

52చూసినవారు
ఎస్ కోట: అగ్నిప్రమాదంలో దగ్ధమైన వరికుప్పలు
ఎస్. కోట మండలం మామిడిపల్లిలో సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో వరి ధాన్యపు కుప్పలు దగ్ధమైనట్లు ఎస్ కోట అగ్నిమాపక అధికారి మదీనా బుధవారం తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ. 2. 5 లక్షలు మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే మంటలను అదుపు చేసి సుమారు రూ. 4 లక్షలు విలువ చేసే వరి ధాన్యాన్ని కాపాడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్