ముషిడిపల్లిలో ఘనంగా శ్రీమంతోత్సవ కార్యక్రమాలు

66చూసినవారు
ముషిడిపల్లిలో ఘనంగా శ్రీమంతోత్సవ కార్యక్రమాలు
శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు శ్రీమంతోత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధరాజు, ఎస్ కోట సర్పంచ్ సంతోషి కుమారితో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు కు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్