శృంగవరపు కోట: ఉగాది నాటికి మౌలిక సదుపాయాలు

79చూసినవారు
ఉగాది నాటికి రహదారులు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పలు గిరిజన గ్రామాల ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్. అంబేద్క‌ర్‌ హామీ ఇచ్చారు. ఎస్. కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలిసి ఆయన శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. గిరిజనులతో గ్రామ సభలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు.

సంబంధిత పోస్ట్