భర్త పురంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

72చూసినవారు
భర్త పురంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
శృంగవరపుకోట మండలం భర్త పురం గ్రామంలో కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు చేశారు. కొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో బ్రహ్మోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్