వేపాడ మండలం కుంపల్లి లో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగాలంటే రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యవంతుడు, మండల పార్టీ అధ్యక్షులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.