బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి - కేసలి

77చూసినవారు
బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి - కేసలి
విజయనగరం: రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ధాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. బాల కార్మిక వ్యతిరేక మాసం నేపథ్యంలో మంగళవారం తోటపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో విజయవాడకి చెందిన క్రాఫ్ వారు రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. బడిఈడు పిల్లలందరు పాఠశాలల్లో విద్యను అభ్యసించాలని, బాలలను పనిలో పెట్టుకుంటే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్