సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో భారత బ్యాటర్ పంత్‌కు గాయమైంది. బంతి చేతికి తగిలిన స్థానంలో ఎర్రగా మచ్చలా ఏర్పడింది. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. అయితే పంత్ తిరిగి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కాగా, స్టార్క్ పంత్ వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.