రాష్ట్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారికి జిఎన్ఎమ్ సెక్షన్ ఇచ్చి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలును కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 115 ను తక్షణమే రద్దు చేయాలని విమ్స్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విశాఖలోని విమ్స్ ప్రధాన గేటు వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు.