అగనంపూడిలో తగ్గిన ఇసుక ధర

81చూసినవారు
అగనంపూడిలో తగ్గిన ఇసుక ధర
గాజువాక మండలం అగనంపూడి ఇసుక డిపోలో బుధవారం నుంచి ఇసుక రేట్లు తగ్గాయి. మొదట టన్ను ఇసుక ధర 1394 గా ఖరారు చేశారు. వైసిపి ప్రభుత్వం టన్ను ధర 1400 చొప్పున అమ్మకాలు జరిపింది. ధరలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇసుక ధర తగ్గించాలని ఇసుక కమిటీకి సూచించారు ఈ మేరకు టన్నుకు 318 రూపాయలు తగ్గించి 1076 గా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్