విశాఖ స్టీల్ ప్లాంట్ పై హై లెవెల్ డిస్కషన్స్ డిల్లీలో జరుగుతున్నాయని ఎంపీ భరత్ అన్నారు. శనివారం విశాఖలోని కూర్మన్నపాలెంలో నిర్వహించిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఏదో నిర్ణయం రానుందని, ఏ ప్రకటన వచ్చినా సరే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కార్మికుల పోరాటానికి అండగా ఉంటామన్నారు.