పలు అభివృద్ధి పనుల గుర్తించి

51చూసినవారు
పలు అభివృద్ధి పనుల గుర్తించి
కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీ కేంద్రంలో ఉపాధి హామీ పథకం గ్రామ సభ శుక్రవారం ఉదయం నిర్వహించారు. సర్పంచ్ జంపా రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో కార్యదర్శి గౌరీ వరహాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తారురోడ్డు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరారు. పలు అభివృద్ధి పనులను గుర్తించి తీర్మానాలు చేశారు.

సంబంధిత పోస్ట్