ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలో పర్యాటక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పర్యాటక రంగ ప్రతినిధులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏపీ. టూరిజం. జివోవి. ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.