విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణంరాజు మరియు మహిళా కానిస్టేబుల్ ఎల్ భవానికి మంగళవారం సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఓ ఫోక్సో కేసు విషయంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణంరాజు, భవాని నిందితుడిని పట్టుకోవడంలో మరియు కోర్టు వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించడంతో సిటీ పోలీస్ కమిషనర్ అభినందించారు.