వినేత్ర పేరుతో స‌బ్‌మెరైన్ ఎస్కేప్ శిక్ష‌ణ

83చూసినవారు
విశాఖపట్నంలోని ఐఎన్ ఎస్‌ శాతవాహనలో "వినేత్ర" పేరుతో అత్యాధునిక సబ్‌మెరైన్ ఎస్కేప్ శిక్షణా సదుపాయాన్ని ప్రారంభించారు. ఆపదలో ఉన్న కల్వరి-తరగతి జలాంతర్గాముల నుంచి సిబ్బంది తప్పించుకునే సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఈ సదుపాయాన్ని తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ప్రారంభించారు. ఈవిష‌యాన్ని ఆదివారం నేవీ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్