జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం

492చూసినవారు
జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం
అరకులోయ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి విలువిద్య పోటీలను క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ పి.ఎస్.యన్. మూర్తి ప్రాంభించారు. ఈ పోటీలలో బాలబాలికలు జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో ఇండియన్ రౌండ్, రికర్వ్ కాంపౌండ్ కేటగిరిలో సుమారు 50 మంది విలువిద్య పోటీదార్లు పాల్గొన్నారు. ఈ కార్యమనికి జిల్లా విలువిద్య సంఘం సెక్రటరీ పి. భాస్కరావు, జిల్లా ఆర్గ్ నై జేషన్ సెక్రటరీ ఎస్. సింహాచలం, జిల్లా వైస్ ప్రెసిడెంట్( సీనియర్ శిక్షకులు) టి.సద్దు,సుబ్బారావు, సుధాకర్, యల్. సూరిబాబు( శిక్షకులు) విలువిద్య పోటీలను పర్యవేక్షించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి విజయవాడలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే పోటీలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ మూర్తి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్