పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ యువతి సొంత అన్నదమ్ములనే హత్య చేసింది. నకరికల్లులోని యానాది కాలనీకి చెందిన పౌలిరాజు ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ ఇటీవల చనిపోయాడు. ఈ క్రమంలో పౌలి రాజు పీఎఫ్ డబ్బులు రూ. 40 లక్షలు వస్తాయని భావించారు. ఆ డబ్బులను ఎలాగైనా దక్కించుకోవాలని క్రిష్ణవేణి వేరే వ్యక్తి సాయంతో సోదరులిద్దరిని చంపేసింది. చివరికి పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో ఆమెను అరెస్ట్ చేశారు.