వైసీపీలోకి భారీ చేరికలు

7633చూసినవారు
వైసీపీలోకి భారీ చేరికలు
అరకు నియోజకవర్గ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన పెదలబడు, గన్నెల, పద్మపురం పంచాయితీ పరిధిలోని 20 గ్రామాల నుంచి టీడీపీ, సీపీఎం, పార్టీలకు చెందిన 400 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. టీడీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ సత్యానందం, గన్నెల పంచాయితీ మాజీ సర్పంచ్ అర్జున్, పద్మాపురం పంచాయితీ వార్డమెంబర్ హరిగోపాల్, సిపిఎం సీనియర్ నాయకులు భీమన్నతో పాటు మరి కొంతమందికి అరకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి గంగాధర్ స్వామి, మత్యలింగం, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కమిడి అశోక్, ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గురుశెట్టి రామారావు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్