అరకువేలి పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్ మండల వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్ఆర్ గిరిజనుల పక్షపతి, గిరిజనులకు విద్యారంగలో పెద్దపిటవేస్తూ అన్నిరంగాలో పైకి తీసుకు రావటానికి అనేక సంక్షేమ అభివృది కార్యక్రమలు అమలు చేసినట్లు తెలిపారు.
ఇప్పటిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ ఆయన ఆశయా సాధనకుకృషి చేస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోని సంక్షేమ పథకాలను కుల మత రాజకీయలను అతీతంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకువాలీ వైసీపీ మండల ప్రెసిడెంట్ కొర్రా గాసి, జడ్పీటీసి అభ్యర్థిని శెట్టి రోషణి, వైసీపీ సీనియర్ నాయకులు రఘునాధ్, చిన్నారావు, విజయకుమార్, వైసీపీ సర్పంచ్ లు సుస్మిత, రమేష్, పార్టీ కార్యకర్తలు, అభిమానలు పాల్గొన్నారు.