బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని హౌసింగ్ కాలనీ లేఅవుట్లను అనకాపల్లి జిల్లా హౌసింగ్ పీడీ వై.శ్రీనివాస్ శనివారం సందర్శించారు. డిఈఈ ఎస్విఎస్ శ్రీనివాసరావుతో కలిసి ఒకటి, రెండు లేఅవుట్లను పరిశీలించారు. అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బిల్లుల పెండింగ్ పై స్థానిక హౌసింగ్ అధికారులతో ఆరా తీశారు.