దిబ్బిడిలో ఎమ్డిఎమ్ కార్మికులకు శిక్షణ

70చూసినవారు
దిబ్బిడిలో ఎమ్డిఎమ్ కార్మికులకు శిక్షణ
బుచ్చయ్యపేట మండలంలోని దిబ్బిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం వన్డే ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. మధ్యాహ్న భోజనం పథకం అమలు, భోజనం మెనూ, నాణ్యత ప్రమాణాలు, పీఎం పోషణ తదితర విషయాలను టిఎంఎఫ్ కోఆర్డినేటర్ పి. అచ్యుతరావు, మాస్టర్ ట్రైనీ గూనురు వరలక్ష్మి చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో-2 బి. కాశీ విశ్వేశ్వరరావు పర్యవేక్షించారు. ఎస్ఎమ్సి చైర్మన్ పాతాళ సత్తిబాబు, సిఆర్పి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్