భారీ లాభాలు అంటూ రూ.2.45 కోట్లు కొట్టేశారు

68చూసినవారు
భారీ లాభాలు అంటూ రూ.2.45 కోట్లు కొట్టేశారు
స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు అంటూ సైబర్ నేరగాళ్లు ఇద్దరు అన్నదమ్ముల నుంచి రూ.2.45 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన పుణెలో జరిగింది. ఇందులో ఒకరు రూ.1.68 కోట్లు, మరొకరు రూ.77.50 లక్షలు చొప్పున నష్టపోయారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు అందుకోవచ్చన్న ఆశ చూపి వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు వీరికి వల వేశారు. వీరితో రూ.2.45 కోట్లు పెట్టుబడి పెట్టించి, ఆ సొమ్ములను తమ ఖాతాలకు మళ్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్