కళ్యాణపులోవ లో గంజాయి తగులు పెట్టవద్దు

3914చూసినవారు
కళ్యాణపులోవ లో గంజాయి తగులు పెట్టవద్దు
చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ ఎగువ, రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో, వివిధ పోలీస్ స్టేషన్లలో, పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని, పోలీసులు, వారి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, కొత్తకోట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో, గంజాయిని కళ్యాణపులోవ ప్రాంతాల్లో తగలబెట్టడం చాలా రోజులుగా జరుగుతుంది. అయితే గత సంవత్సరం ఆ ప్రాంత గిరిజన వ్యతిరేకించడంతో, విశాఖపట్నం సముద్ర ప్రాంతంలో తగులబెట్టారు.

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం. గంజాయి తగులబెట్టి వలసి ఉంది, అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేశారు. ఈ విషయం తెలిసిన కళ్యాణపులోవ, ములకలపల్లి, గ్రామాల గిరిజనులు గంజాయి తగలబెడితే, ఆ పొగ వలన స్థానిక మహిళలు గర్భిణీలు బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఇక్కడ గంజాయి తగులబెట్ట వద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, గంజాయి వేరే ప్రాంతంలో తగులు పెట్టుకునే విధంగా పోలీసు వారిని ఆదేశించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్